తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపల్‌ సమావేశంలో రసాభాస.. కౌన్సిలర్ల తోపులాట

Dispute between YSRCP councillor: ఆంధ్రప్రదేశ్​ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్‌ కౌన్సిల్ సమావేశంలో వైకాపా కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభా భవనంలోనే ఒకరినొకరు తోసుకుని చెప్పులు విసురుకున్నారు. 13వ వార్డులో తాగునీటి సమస్య పట్టించుకోవట్లేదని కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ ప్రశ్నించడంతో వైస్‌ఛైర్మన్‌ ఖాజామొహిద్దీన్ గొడవకు దిగారు.

PRODDUTOOR
PRODDUTOOR

By

Published : Mar 31, 2022, 2:02 PM IST

PRODDUTOORమున్సిపల్‌ సమావేశంలో రసాభాస.. కౌన్సిలర్ల తోపులాట

Dispute between YSRCP councillor: ఏపీ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్‌ కౌన్సిల్ సమావేశం రసాబాసగా మారింది. ఛైర్​పర్సన్ లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైకాపా కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పట్టణంలోని కొన్ని పనుల విషయమై 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ తన వార్డులో నీటి సమస్య ఉందని.. ఎన్నిసార్లు చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వైస్ ​ఛైర్మన్ బంగారు మునిరెడ్డి సమాధానమిచ్చారు.

కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా వినకపోవడంతో పక్కనే ఉన్న మరో వైస్​ఛైర్మన్ ఖాజా మోహిద్దీన్ సర్దిచెప్పాలని చూశారు. అనంతరం మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు చెప్పులు విసిరేసుకుని దాడి చేసుకున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో మిగిలిన సభ్యులు విస్తుపోయారు.

ABOUT THE AUTHOR

...view details