ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్లలో శ్మశానవాటిక వద్ద రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. అంత్యక్రియల కోసం ఏర్పాటు చేసిన గుంతను మరో వర్గం ధ్వంసం చేసింది. అంత్యక్రియలు చేయడానికి వీల్లేదంటూ అడ్డుకుంది. ఆగ్రహించిన మృతుడి బంధువులు రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి వాదనకు దిగారు. పెనుగంచిప్రోలు పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
శ్మశాన వాటిక కోసం ఇరువర్గాల మధ్య వివాదం.. చివరకు..! - ఎన్టీఆర్ జిల్లాలో శ్మశాన వాటిక కోసం వివాదం
శ్మశాన వాటిక కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయడానికి వీల్లేదంటూ.. ఒక వర్గం వారు అడ్డుకోవడంతో వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్లలో జరిగింది.
శ్మశాన వాటిక కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ
TAGGED:
Conflict Between Two Groups