బంజారాహిల్స్ ముఫఖంజా కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. ఓట్ల లెక్కింపు గల్లంతు అవుతోందని ఏజెంట్లు ఆందోళనకు దిగారు.
కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వివాదం - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020 ఫలితాలు
బంజారాహిల్స్ ముఫఖంజా కళాశాల కౌంటింగ్ సెంటర్లో స్వల్ప వాగ్వాదం జరిగింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కౌంటింగ్ ఏజెంట్ల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వివాదం
92.. 93.. 94.. 95 డివిజన్లలో లెక్కింపు జరుగుతుండగా.. వెంకటేశ్వర కాలనీ డివిజన్ కేంద్రంలో ఇరు పార్టీల ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు. అధికారులు సర్ధిచెప్పి కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించారు.
ఇదీ చూడండి :ఎస్ఈసీ సర్క్యులర్ అమలును నిలిపివేసిన హైకోర్టు