తెలంగాణ

telangana

అంబులెన్స్​ సిబ్బంది నిర్లక్ష్యం.. రోడ్డుపైనే వాడిన పీపీఈ కిట్ల పడవేత

ఓవైపు కరోనాతో జనం భయభ్రాంతులకు గురువుతుంటే.. కొందరు వైద్య సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. పీపీఈ కిట్లు, ఫేస్​ షీల్డులను ఎక్కడపడితే అక్కడ పడేస్తూ.. వైరస్​ వ్యాప్తికి కారణమవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మలక్​పేట్​లో ఈటీవీకి చిక్కింది.

By

Published : Jul 25, 2020, 2:06 PM IST

Published : Jul 25, 2020, 2:06 PM IST

Disposal of used PPE kits on the road at malakpet
అంబులెన్స్​ సిబ్బంది నిర్లక్ష్యం.. రోడ్డుపైనే వాడిన పీపీఈ కిట్ల పడవేత

కరోనా నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంటే.. కొందరు మాత్రం నిర్లక్ష్యం వహిస్తూ వైరస్‌ను తేలికగా తీసుకుంటున్నారు. అంబులెన్స్‌లో ఉపయోగించే పీపీఈ కిట్లు తొలగించిన అనంతరం ఎక్కడపడితే అక్కడ పడేస్తున్న ఘటనలు హైదరాబాద్‌లో వెలుగు చూస్తున్నాయి. తాజాగా మలక్‌పేట టీవీ టవర్‌ వద్ద ఓ 108 అంబులెన్స్‌ డ్రైవర్‌ పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డులను అందరూ చూస్తుండగానే పడేసి వెళ్లాడు.

ఈ దృశ్యాలు ఈటీవీకి చిక్కడంతో అప్రమత్తమైన సిబ్బంది.. తప్పించుకోవాలని చూశారు. అదే సమయంలో అటుగా వెళ్తోన్న మలక్‌పేట ఎస్సై దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి వాటిని అక్కడే కాల్చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడపడితే అక్కడ పడేయొద్దని సిబ్బందిని హెచ్చరించారు.

ఇలా జంట నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల ప్రజలు భయాందోళకు గురవుతున్నారు.

అంబులెన్స్​ సిబ్బంది నిర్లక్ష్యం.. రోడ్డుపైనే వాడిన పీపీఈ కిట్ల పడవేత

ఇదీచూడండి: కరోనాను మంత్రాలతో తగ్గిస్తాడు.. ఈ కరోనా బాబా!

ABOUT THE AUTHOR

...view details