దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో విచారణ - Disha encounter case today news
దిశ మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో విచారణ జరిగింది. మృతదేహాలు అప్పగించేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది రాఘవేంద్రప్రసాద్ కోర్టుకు విన్నవించారు.
Disha encounter case
యువ వైద్యురాలు దిశ హత్యకేసులో నిందితుల మృతదేహాలు అప్పగించాలని న్యాయవాది రాఘవేంద్రప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సూచనలతో హైకోర్టుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే... సుప్రీంకోర్టు నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని హైకోర్టు పేర్కొంది. సుప్రీం ఆదేశాల ప్రతిని తమకు అప్పగించాలని సూచించింది. తమ వద్ద ఉన్న పిటిషన్ల విచారణపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్టే విధించిందని న్యాయస్థానం తెలిపింది.