'దిశ కేసు నిందితుల మృతదేహాలు ఇప్పటికే సగం కుళ్లిపోయాయి' - disha case latest news
దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై ఇవాళ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. విచారణకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ హాజరయ్యారు. మృతదేహాలు ఇప్పటికే సగం కుళ్లిపోయినట్లు... ఐదారు రోజుల్లో పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని శ్రవణ్ కోర్టుకు తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాలకు పోస్టుమార్టం చేశారని... మళ్లీ పోస్టుమార్టం చేయాలని పిటిషనర్లు అడగలేదని ఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని కోర్టు సహాయ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. మృతదేహాల అప్పగింత అంశంపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
disha case latest news
....
TAGGED:
disha case latest news