తెలంగాణ

telangana

ETV Bharat / state

'దిశ' కేసునూ వదలని కరోనా! - Disha case adjourned due to corona effect

disha case latest news
disha case latest news

By

Published : Mar 17, 2020, 4:53 PM IST

Updated : Mar 17, 2020, 7:15 PM IST

16:50 March 17

'దిశ' కేసునూ వదలని కరోనా!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా... దిశ కేసునూ ప్రభావితం చేస్తోంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు విచారణను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిషన్ వాయిదా వేసింది. కరోనా కారణంగా ఈనెల 23, 24 తేదీల్లో జరగాల్సిన విచారణను వాయిదా వేస్తున్నట్టు కమిషన్​ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.  

           ఇప్పటికే హైకోర్టులోకి ప్రవేశం, కేసుల విచారణకు సంబంధించి కొన్ని ఆంక్షలను న్యాయస్థానం విధించింది. దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై ముగ్గురు సభ్యులతో సుప్రీంకోర్టు కమిషన్ ఏర్పాటు చేసింది. కేసు విచారణ కోసం గత నెల 4న హైదరాబాద్ చేరుకున్న కమిషన్... హైకోర్టు ప్రాంగణంలో తమకు కేటాయించిన కార్యాలయానికి వచ్చారు. ఎన్​కౌంటర్​లో మృతి చెందిన నలుగురి పోస్టుమార్టం నివేదికతో పాటు... సిట్ బాధ్యుడు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నుంచి వివరాలు సేకరించారు.  

Last Updated : Mar 17, 2020, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details