Chandrababu Kandukuru meeting: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబు సభలో విషాదం చోటు చేసుకుంది. చంద్రబాబు సభకు భారీగా కార్యకర్తలు తరలిరావడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కాలువలో పడి 8 మంది కార్యకర్తలు చనిపోగా... మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మృతి చెందినవారు గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం చినకొండయ్య, కందుకూరు పట్టణం గుర్రంవారి పాలెంకు చెందిన కాకుమాని రాజా, ఉలవపాడు మండలం ఆత్మకూరు చెందిన దేవినేని రవింద్రబాబు, ఉలవపాడు మండలం ఒరుగుసేనుపాలెం చెందిన యాటగిరి విజయలు ఉన్నారని పార్టీ నేతలు తెలిపారు.
చంద్రబాబు సభలో విషాదం.. 8కి చేరిన మృతుల సంఖ్య
20:47 December 28
కందుకూరు చంద్రబాబు సభలో విషాదం
మరో ఇద్దరు కందుకూరు మండలం కొండముడుసు పాలెంకు చెందిన కలవకూరి యానాది, ఓగూరు వాసి గడ్డ మధుబాబులుగా గుర్తించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వారికి చికిత్స కొనసాగుతోంది. ఆస్పత్రిలో బాధితులను చంద్రబాబు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. పార్టీ తరఫున మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. బాధితుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు విద్యా సంస్థల్లో చదివిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఘటనపై నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెదేపా కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన నారా లోకేశ్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశామన్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
ఇవీ చదవండి: