తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేటు ఆస్పత్రులకు టీకా డోసుల పంపిణీ నిలిపివేత - telangana latest news

corona vaccine
కరోనా

By

Published : Apr 30, 2021, 3:13 PM IST

Updated : Apr 30, 2021, 5:47 PM IST

15:12 April 30

ప్రైవేటు ఆస్పత్రులకు టీకా డోసుల పంపిణీ నిలిపివేత

ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం కేటాయిస్తున్న వ్యాక్సిన్ డోసులను నిలిపివేయాలని జిల్లాల వైద్యాధికారులను డీహెచ్ శ్రీనివాస రావు ఆదేశించారు. నేటి వరకు అందుబాటులో ఉన్న టీకా డోసులను వినియోగించుకోవచ్చని ఆదేశాల్లో పేర్కొన్న డీహెచ్ మిగిలిన డోసులను ప్రైవేటు ఆస్పత్రుల నుంచి సేకరించే బాధ్యతను సీసీపీ మెడికల్ ఆఫీసర్లు, ఫార్మసిస్ట్​లకు అప్పగించారు. మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రం కోరటం, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

ఇప్పటికే కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల వారు ప్రభుత్వం కేటాయించిన టీకాలను అర్హులకు అందించకుండా మే 1 తర్వాత అమ్ముకునే ఏర్పాట్లు చేశాయంటూ విమర్శలు తలెత్తాయి. అయితే ఇలాంటి అవతవకలకు అవకాశం లేకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన సర్కారు... ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటి వరకు కేటాయించిన టీకా డోసుల వివరాలు, మొదటి, రెండు డోసులు టీకా తీసుకున్న వారి వివరాలతో పాటు.. వ్యాక్సిన్​ వేస్టేజీ వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని ప్రైవేటు ఆస్పత్రులకు స్పష్టం చేశారు. మిగిలిన టీకా డోసులను తిరిగి ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. తొలి డోస్ తీసుకున్న కేంద్రంలోనే రెండో డోస్ తీసుకోవాలన్న నిబంధన లేని కారణంగా.. ప్రైవేటులో తీసుకున్న వారు సైతం ప్రభుత్వ కేంద్రాల్లో రెండో డోస్ టీకా తీసుకునే వెసులుబాటు ఉంది.

ఇదీ చదవండి:నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించక తప్పదు!

Last Updated : Apr 30, 2021, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details