తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు పడక గదుల ఇళ్ల కోసం కలెక్టరేట్ ముందు దివ్యాంగుల ధర్నా - double bedrrom houses latest news

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అర్హులైన దివ్యాంగులకు ఐదు శాతం కోటాలో రెండు పడక గదుల ఇళ్లు కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ధర్నా చేసింది. హైదరాబాద్​లోని నాంపల్లి కలెక్టరేట్ ముందు దివ్యాంగ హక్కుల నేతలు నిరసన చేపట్టారు.

రెండు పడక గదుల ఇళ్ల కోసం కలెక్టరేట్ ముందు దివ్యాంగుల ధర్నా
రెండు పడక గదుల ఇళ్ల కోసం కలెక్టరేట్ ముందు దివ్యాంగుల ధర్నా

By

Published : Sep 14, 2020, 2:56 PM IST

హైదరాబాద్ నాంపల్లిలోని కలెక్టరేట్ ముందు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ధర్నా నిర్వహించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుపేదలకు లక్ష.. రెండు పడక గదులు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వికలాంగుల హక్కుల జాతీయ నేత వెంకటేశ్ గుర్తు చేశారు.

అద్దె ఇళ్లల్లో నివాసం..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వేలాది వికలాంగులు సొంత నివాసాలు లేక అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. 2014 నుంచి డబుల్ బెడ్ రూమ్​ల ఎంపిక కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏడు క్లస్టర్స్​లో అధికారులను నియమించిందని పేర్కొన్నారు.

మొదటి ప్రాధ్యానత ఇవ్వాలి..

లబ్ధిదారుల ఎంపికలో తమకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వెంకటేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన సుమారు 85 వేల ఇళ్లలో 5 శాతం మేర సుమారు 4250 ఇళ్లను వికలాంగులకు కేటాయించాలని కోరారు.

ఇవీ చూడండి : రెవెన్యూ సంస్కరణలు ప్రజలు ఉపయోగపడేలా ఉండాలి: వీహెచ్

ABOUT THE AUTHOR

...view details