తెలంగాణ

telangana

ETV Bharat / state

దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమశాఖ ఆవిర్భావం.. ఉత్తర్వులు జారీ - దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ ప్రత్యేక శాఖ

Disabled welfare department Establishment: శనివారం జరగనున్న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఇన్నాళ్లుగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో భాగంగా ఉన్న దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ విభాగాన్ని ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసింది.

d
దివ్యాంగుల దినోత్సవం

By

Published : Dec 2, 2022, 10:56 PM IST

Disabled welfare department Establishment: రేపు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఇన్నాళ్లుగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో భాగంగా ఉన్న దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ విభాగాన్ని ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసింది. దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దివ్యాంగుల సంక్షేమంపై మరింతగా దృష్టి సారించేందుకు వీలుగా ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఎస్సీ అభివృద్ధి శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర్వుల జారీతో దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లకు... సంక్షేమం, సమర్థ సేవలు అందించేందుకు వీలుగా జిల్లా స్థాయిలోనూ మహిళా, శిశుసంక్షేమ శాఖ నుంచి వేరు చేశారు. జిల్లా సంక్షేమ అధికారిని నియమిస్తారు. అందుబాటులో ఉన్న క్యాడర్ స్ట్రెంత్‌ను పునఃపంపిణీ చేసేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. మహిళా, శిశు సంక్షేమం... దివ్యాంగుల సంక్షేమ శాఖల మధ్య ప్రతి జిల్లాకు శాఖాపరమైన వర్కింగ్ అరేంజ్‌మెంట్‌ చేయనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details