కరోనా రెండో దశ కోరలు చాస్తుంటే.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాత్రం పరిశుభ్రత లోపించి ప్రయాణికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. స్టేషన్ ఎదుట ఫుట్‌పాత్‌ల వద్ద ఎక్కడికక్కడా అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.
కంపు కొడుతోన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంగణం - telangana news
ఓ వైపు కరోనా కేసులు విజృంభిస్తుంటే మరోవైపు పరిశుభ్రత కరవై జనాలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఇలాంటి దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.

మురికి కూపంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంగణం
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో వలస కార్మికులు ఇంటిబాట పడుతున్నారు. ఫుట్‌పాత్‌ల వద్ద వేచి ఉండే సమయంలో అక్కడ ఉన్న చెత్త, మురికి నుంచి దుర్వాసన వస్తున్నట్లు ప్రయాణికులు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు రైల్వేస్టేషన్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:తెలంగాణలో ఆస్పత్రులు ఎంత భద్రం?