తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొ-విన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికే టీకా'

By

Published : Jan 5, 2021, 12:54 PM IST

Updated : Jan 5, 2021, 1:31 PM IST

Directors of Public Health said Vaccine only for those who are registered on the Co-Win portal
'కొ-విన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికే టీకా'

12:52 January 05

'కొ-విన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికే టీకా'

'కొ-విన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికే టీకా'

కొవిడ్ వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ పేర్కొన్నారు. గురు, శుక్ర వారాల్లో 1,200 కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొ-విన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికే టీకా అందజేస్తామని ప్రకటించారు. 

వారానికి 4 రోజులు కొవిడ్ టీకాల పంపిణీ ఉంటుందని వివరించారు. బుధ, శని వారాల్లో మిగిలిన టీకాల పంపిణీ చేస్తామని చెప్పారు. వందకుపైగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా పంపిణీ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. పది రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశముందని ఉద్ఘాటించారు. 

Last Updated : Jan 5, 2021, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details