Black film fine: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కారు అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్‌ను హైదరాబాద్ పోలీసులు తొలగించారు. త్రివిక్రమ్ కారుకు జరిమానా విధించిన జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు అద్దాలు తొలగించి పంపించారు. ఆ సమయంలో త్రివిక్రమ్ కారులోనే ఉన్నారు. వాహనాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించాలని కొన్నిరోజులుగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలా తొలగించని వారి వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. ఎంతటివారైనా నిబంధనలు అతిక్రమిస్తే వదిలేది లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మంచు మనోజ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్ కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌లను పోలీసులు తొలగించి ఫైన్ వేశారు.
Black film fine: ప్రముఖ దర్శకుడికి జరిమానా.. కారు బ్లాక్ ఫిల్మ్ తొలగింపు
Black film fine: హైదరాబాద్ పోలీసులు బ్లాక్ ఫిల్మ్ అద్దాలు ఉపయోగించే కార్లపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇవాళ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కారుకు జరిమానా విధించారు. కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించారు.
గత నెల జూబ్లీహిల్స్‌లో జరిగిన కారు ప్రమాదం అనంతరం పోలీసులు చర్యలు చేపట్టారు. నగరంలో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్లతో పాటు ప్రజాప్రతినిధుల స్టిక్కర్లున్న వ్యక్తిగత వాహనాలు గుర్తించి తొలిగిస్తున్నారు. సరైన నంబర్ ప్లేట్లులేని వాహనాలను వావాహాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న కారు పాదచారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన మహిళలకు తీవ్రగాయాలు కాగా.. శిశువు మరణిచింది.
ఇదీ చూడండి: అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్ కార్లకు జరిమానా.. ఎందుకంటే..?