కొవిడ్ సెకండ్ వేవ్‌ని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు ఆదేశించారు. కరోనా సెకండ్ వేవ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసిర్ స్పష్టం చేయడంతో పాటు... హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అన్ని జిల్లాల డీఎంహెచ్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్ బారిన పడిన 70 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండటం లేదని తెలిపారు.
'కొవిడ్ సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తత అవసరం' - కరోనా సెకండ్ వేవ్ తాజా వార్తలు
కరోనా సెకండ్ వేవ్ పట్ల ఇప్పటినుంచే జాగ్రత్తగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. అన్ని జిల్లాల డీఎంహెచ్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైతే ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించారు.
'కొవిడ్ సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తత అవసరం'
రాష్ట్రంలో 1096 కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని... అవసరమైతే ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. లక్షణాలు ఉన్న వారిని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు గుర్తించాలని కోరారు. ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ ఏర్పాటు చేశామని... అదనంగా మరో 752 సిలెండర్లను సమకూరుస్తున్నట్లు తెలిపారు. వాటిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.