జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనే నేతలు తమ కార్యకర్తలు అభిమానులు తప్పక మాస్కులు ధరించటంతో పాటు.. తగిన భౌతిక దూరాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్ రెడ్డి కోరారు.
ప్రచారంలో పాల్గొనే నేతలకు విజ్ఞప్తి.. ఇవి పాటించాల్సిందే! - GHMC Elections 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ తరుణంలో ప్రచారంలో పాల్గొనే నేతలు, కార్యకర్తలకు డీఎంఈ రమేశ్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు. తప్పక మాస్కులు ధరించటంతో పాటు.. తగిన భౌతిక దూరాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు కోఠిలోని డీహెచ్ కార్యాలయంలో డీఎంఈ రమేశ్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. పండుగల సమయంలో కేసులు పెరుగుతాయని భావించినప్పటికీ ప్రజలు తీసుకున్న జాగ్రత్తల వల్లే కొవిడ్ నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. సెకండ్ వేవ్ ప్రారంభమైతే ఎదుర్కోవడానికి తాము సిద్దంగా ఉన్నామన్న డీహెచ్ .... శీతాకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరో దిల్లీని చూడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.
పలు చోట్ల కాంట్రాక్టు, ఔట్ సౌర్సింగ్ ఉద్యోగులు ధర్నాలు చేపట్టడాన్ని డీఎంఈ రమేశ్‌రెడ్డి తప్పుపట్టారు. జీతాలు ఎప్పటికప్పుడు అందేలా చూస్తున్నామన్న ఆయన.... క్వారంటైన్ సెలవులు ఎవరికీ హక్కు కాదని పేర్కొన్నారు. క్వారంటైన్ సెలవులు ఇవ్వకపోతే... విధుల్లోకి హాజరుకామనే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
- ఇదీ చూడండి:హైదరాబాద్‌లో 20 లక్షల హవాలా డబ్బు స్వాధీనం