తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఒక అభిమానిగానే... మర్యాదపూర్వకంగా కలిశారని తెలిపారు. సినిమాలో తాను స్వరం చేసిన ఒక పాట నచ్చి... తనను కలుస్తానని సీఎం ఫోన్ చేశారని విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తనను కలిసినట్లు వివరించారు. కేసీఆర్ తన ఇంటికి రావడం శ్రీ కృష్ణుడు... కుచేలుని ఇంటికి వచ్చినట్లుగా ఉందని అన్నారు. ఇప్పటివరకు చాలా సినిమాలు తీశానని... ప్రస్తుతానికి ఇక సినిమాలు తీయనని కళాతపస్వి చెప్పారు.
పూర్తి ఆరోగ్యంగానే ఉన్నా : కె.విశ్వనాథ్ - సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అభిమానిగానే తనను మర్యాదపూర్వకంగా కలిశారని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. కేసీఆర్ తన ఇంటికి రావడం శ్రీకృష్ణుడు కుచేలుని ఇంటికి వచ్చినట్లుగా ఉందని పేర్కొన్నారు.
కె విశ్వనాథ్