ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుంచి యూరప్ దేశాలకు నేరుగా సరకు రవాణా మొదలైంది. కంటైనర్ల ద్వారా నేరుగా పంపడం ద్వారా ఈ మార్గాన్ని సురక్షితమైన, సౌకర్యవంతంగా నిరూపించేందుకు అధికార్లు చేసిన యత్నాలు ఫలిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ నుంచి సరకు యూరప్‌కి వెళ్తున్నా... సింగపూర్, శ్రీలంక నౌకాశ్రయాల్లో కంటైనర్లు మార్చాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితిని అధిగమించారు. ఏపీ నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్ గఢ్, తెలంగాణా నుంచి సరకుల ఎగుమతికి ఇప్పుడు మరింత సానుకూలత వ్యక్తమవుతోంది.
విశాఖ నుంచి యూరప్‌కు నేరుగా సరకు రవాణా - vishaka shipyard news
ఏపీలోని విశాఖ నుంచి యూరోపియన్ దేశాలకు నౌకా వాణిజ్యం పెరుగుతోంది. ఇంతకుముందున్న అవరోధాలను అధిగమించి... నేరుగా ఆ దేశాలకు సరకును రవాణా చేస్తున్నారు.
విశాఖ నౌకాశ్రయంలో కంటైనర్ టెర్మినల్ నిర్వహిస్తున్న వీసీటీపీఎల్ నుంచి ఇప్పటికే మూడు నౌకలు యూరోప్ దేశాలకు వైజాగ్ నుంచి నేరుగా పంపారు. వారానికి కనీసం రెండు వేల కంటైనర్ల సరకు పంపడం లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖ పట్నం పోర్టు ట్రస్ట్ ప్రత్యేకంగా ఈ మార్గంపై నేరుగా నౌకలను పంపేందుకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించే విధంగా కూడా అధికార్ల బృందంతో కసరత్తు ఆరంభించింది. యూరప్ దేశాలకు విశాఖ నుంచి ఫ్రోజెన్ ఫుడ్స్ ఎగుమతి దాదాపు 22 శాతం పెరిగింది. రానున్న కాలంలో మరింతగా వీటి పరిమాణం పెరిగేందుకు వీలవుతోంది.
ఇవీ చూడండి: కల్యాణలక్ష్మికి.. అందని "లక్ష్మీ" కటాక్షం..?