తెలంగాణ

telangana

ETV Bharat / state

కాసేపట్లో హైదరాబాద్‌కు ట్రబుల్‌ షూటర్ దిగ్విజయ్‌సింగ్‌ - High Command action to solve T Congress dispute

రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలకు అడ్డుకట్ట వేసేందుకు... అధిష్ఠానం ఆదేశాలతో సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ రంగంలోకి దిగారు. ఈ రాత్రికి హైదరాబాద్‌ వస్తున్న దిగ్విజయ్‌....అసంతృప్తితో ఉన్న సీనియర్లు, పార్టీ పదవులకు రాజీనామా చేసిన 12 మందితో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. ఇప్పటికే దిల్లీలో ఇంఛార్జి ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశమై...తెలంగాణాలో పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు.

Digvijay Singh and Manikkam Tagore met at AICC
Digvijay Singh and Manikkam Tagore met at AICC

By

Published : Dec 21, 2022, 2:35 PM IST

Updated : Dec 21, 2022, 7:10 PM IST

High Command To solve T Congress Dispute : తెలంగాణ కాంగ్రెస్‌లో తలెత్తిన వివాదానికి తెరదించేందుకు... పార్టీ అధిష్ఠానం చర్యలు ముమ్మరం చేసింది. ట్రబుల్‌ షూటర్‌గా సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ను రంగంలోకి దించింది. మంగళవారం మధ్యాహ్నం నుంచే దిగ్విజయ్‌... వ్యతిరేక, అనుకూల వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్ర ఇంఛార్జులుగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీం జావిద్‌, రోహిత్‌ చౌదరితో దిల్లీలో ప్రత్యేక సమావేశమయ్యారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో తాజా పరిస్థితులపై ఆరా తీశారు. పీసీసీ కమిటీలు, సీనియర్ల అసంతృప్తికి గురించి అడిగి తెలుసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ గ్రూపుల మధ్య అభిప్రాయభేదాలపై తెలుసుకున్నట్లు సమాచారం. ఇవాళ రాత్రి 7 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. మర్యాదపూర్వకంగా పలువురు కాంగ్రెస్‌ నేతల్ని కలిసే అవకాశం ఉంది. అలాగే ఏఐసీసీ ఇటీవల ప్రకటించిన కమిటీల జాబితా తనకు అందించాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది.

అసంతృప్తితో ఉన్న సీనియర్లతో గాంధీభవన్‌ లేదా తాను బస చేసిన హోటల్‌లో దిగ్విజయ్‌సింగ్‌ సమావేశం అయ్యే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడి తీరుపై దిగ్విజయ్‌ ఎదుట తమ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు సీనియర్‌ నేతలు సిద్ధమవుతున్నారు. పీసీసీ కమిటీల్లో పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్నవారికి పదవులు ఇవ్వలేదనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు.

ఇవీ చదవండి:అధిష్ఠానం హామీ.. కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభానికి తాత్కాలిక తెర

మళ్లీ భయం పుట్టిస్తున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలకు కీలక సూచన

Last Updated : Dec 21, 2022, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details