తెలంగాణ

telangana

ETV Bharat / state

Digital Payment in TSRTC : తెలంగాణ ఆర్టీసీలో 'చిల్లర' సమస్యకు చెక్.. త్వరలోనే 'డిజిటల్ పే' విధానం.. బండ్లగూడ డిపోలో పైలట్ ప్రాజెక్టు - Digital Payment Services in Telangana RTC

Digital Payment in TSRTC : టీఎస్‌ఆర్టీసీ అన్ని రకాల బస్సుల్లో క్యాష్‌లెస్ సేవలు అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపైస్థాయి బస్సులన్నింట్లో ఐ-టిమ్స్‌ పరికరాలను వినియోగంలోకి తెచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు బండ్లగూడ బస్‌డిపోను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.

Digital services to TSRTC commuaters
TSRTC

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 10:10 AM IST

Digital Payment in TSRTC : ఆర్టీసీలోని అన్ని రకాల బస్సుల్లోత్వరలో నగదు రహిత చెల్లింపుతో ప్రయాణం చేసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపైస్థాయి బస్సులన్నింట్లో ఐ-టిమ్స్‌ పరికరాలు వినియోగంలోకి రానున్నాయి. దీంతో డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతోపాటు ఫోన్‌పే, గూగుల్‌పే వంటి వాటితో చెల్లింపులు చేయవచ్చని అధికారులు తెలిపారు.

Digital Payment Services in Telangana RTC : ఈ మేరకు బండ్లగూడ బస్‌డిపోను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. డిపోలోని ఆర్డినరీ, మెట్రో సహా మొత్తం 145 బస్సుల్లో ఐ-టిమ్స్‌ను (I-Tims) వాడేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. అనంతరం కంటోన్మెంట్‌ డిపోలో అమలు చేశాక.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,300 బస్సుల్లో దశలవారీగా ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందించామని అధికారులు వెల్లడించారు.

Digital Payment in Telangana RTC :ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌ తీసుకునే సమయంలో చిల్లర సమస్యతో కండక్టర్లు, ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. దీంతో ఆర్టీసీ యాజమాన్యం బస్‌ టికెట్ల ధరలను రూ.10, 15, 20... ఇలా రౌండ్‌ ఫిగర్‌గా మార్చేసింది. అయినా సమస్యకు పాక్షికంగా పరిష్కారమే లభించింది. మరోవైపు దూరప్రాంత, అధిక ఛార్జీలుండే 700 సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సుల్లోనే ఐ-టిమ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన 8,300 బస్సుల్లో సాధారణ టిమ్స్‌ మాత్రమే ఉన్నాయి.

Telangana Govt Explanation on RTC Bill : ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలోకి.. యథాతథంగా ఆర్టీసీ సంస్థ

TSRTC Bus Tracking App :ఇటీవలే ప్రజలకు రవాణా మరింత సౌకర్యంగా, అనుకూలంగా మార్చేందుకు టీఎస్​ఆర్టీసీ సరికొత్త బస్ ట్రాకింగ్ యాప్‌తో ముందుకు వచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో తీర్చిదిద్దిన బస్ ట్రాకింగ్ గమ్యం యాప్‌ను (Gamyam app) ప్రారంభించింది. ప్రస్తుతం 4170 టీఎస్ఆర్టీసీ (TSRTC) బస్సులకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పుష్పక్ ఎయిర్‌ పోర్ట్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉందని చెప్పారు.

వివిధ జిల్లాలో పల్లె వెలుగు బస్సులు మినహా అన్ని బస్సులకు ఈ యాప్​ సదుపాయం ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. గమ్యం యాప్ ద్వారా ఆరంభ స్థానం నుంచి గమ్యస్థానం వరకు ప్రయాణికులు ఏఏ బస్సులు.. ఏఏ సమయాల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చని చెప్పారు. డ్రైవర్, కండక్టర్ వివరాలు సైతం అందులో కనిపిస్తాయని పేర్కొన్నారు.

TSRTC Gamyam app : ఈ యాప్‌లో కేవలం బస్ ట్రాకింగ్ సదుపాయమే కాకుండా..మహిళల భద్రత కోసం ప్లాగ్ ఏ బస్ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సజ్జనార్ వెల్లడించారు. టీఎస్​ఆర్టీసీ గమ్యం పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో (Google Play Store) అందుబాటులో ఉందని అధికారులు పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.tsrtc.telangana.gov.in నుంచీ ఈ యాప్‌ను ఉచితంగా డౌన్​లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ యాప్‌లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

TSRTC merging bill passed in assembly : ఆర్టీసీ బిల్లుకు ఉభయ సభల ఆమోదం... వారంతా ఇక సర్కారీ ఉద్యోగులే

TSRTC Decide to Special Buses Srisailam : శ్రీశైలం భక్తులకు TSRTC స్పెషల్​ ప్యాకేజ్​

ABOUT THE AUTHOR

...view details