తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇకపై ఇంటివద్దనే జీవన్​ ప్రమాణ్​ ధ్రువపత్రం అందజేత - జీవన్​ ప్రమాణ్​ తాజా వార్తలు

పింఛన్​దారుల కోసం తపాలాశాఖ ఓ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఫించన్​దారులకు ఇంటి వద్దే జీవన్​ప్రమాణ్​ ధ్రువపత్రాన్ని అందిస్తోంది. పోస్ట్​మ్యాన్​ ఇంటి వద్దకే వచ్చి జీవన్​ ప్రమాణ్​ ధ్రువపత్రాన్ని అందించనున్నారు.

Digital_Life_Certificate_Service to be at home by postman from now
ఇకపై ఇంటివద్దనే జీవన్​ ప్రమాణ్​ ధ్రువపత్రం అందజేత

By

Published : Nov 4, 2020, 5:15 PM IST

ప్రభుత్వ ఉద్యోగాలు, కార్పొరేషన్​ సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు యాజమాన్యాలు నెలనెలా పింఛన్​ అందిస్తాయి. పింఛన్​ పొందాలంటే డిజిటల్​ లైఫ్​ సర్టిఫికెట్​ను పింఛన్​దారులు అందించాల్సి ఉంటుంది. తాము జీవించి ఉన్నట్లు పింఛన్​దారు తమ మాతృసంస్థకు ధ్రువీకరణ పత్రం అందించాలి. పింఛన్​దారుడు ఏటా నవంబర్​లో డిజిటల్​ లైఫ్​ సర్టిఫికెట్​ను అందిస్తేనే మరుసటి ఏడాది నుంచి పింఛన్​ కొనసాగుతుంది.

ఇదివరకు కాగితాలపై అందించే లైఫ్​ సర్టిఫికెట్​ను ఉద్యోగి జీవన్​ ప్రమాణ్​ పత్రాన్ని తీసుకెళ్లి తాను పనిచేసిన కార్యాలయ అధికారి దగ్గర సంతకం తీసుకుని దాన్ని పింఛన్​ కార్యాలయానికి తీసుకుని వెళ్లేవారు. గత నాలుగైదేళ్లుగా బయోమెట్రిక్​ ద్వారా జీవన్​ ప్రమాణ్​ పత్రాన్ని సేకరిస్తున్నారు. పింఛన్​దారులు మీ-సేవా కేంద్రాలు లేదా బషీర్​బాగ్​లోని ప్రావిడెంట్​ ఫండ్​ కార్యాలయంలో బయోమెట్రిక్​ లేదా ఐరిస్ ద్వారా డిజిటల్​ లైఫ్​ సర్టిఫికెట్​ను పొందేవారు.

ప్రావిడెంట్​ ఫండ్​ కార్యాలయం అభ్యర్థన మేరకు తపాలా శాఖ జీవన్​ ప్రమాణ్​ సేవలను అందిస్తోంది. పింఛన్​దారుడు సమీపంలో ఉన్న తపాలాశాఖకు సమాచారం అందిస్తే పోస్ట్​మ్యాన్​ నేరుగా ఇంటివద్దకు వచ్చే బయోమెట్రిక్ లేదా ఐరిష్​ ద్వారా డిజిటల్​ లైఫ్​ సర్టిఫికేట్​ సేవలు అందించనున్నారు. పింఛన్​దారుడు.. తన ఆధార్​, చరవాణి నంబర్​, పింఛన్​కు సంబంధించిన వివరాలను తపాలా బంట్రోతుకు తెలపాల్సి ఉంటుంది. డిజిటల్​ లైఫ్​ సర్టిఫికెట్​ అందించినందుకు రూ.70 చెల్లిస్తే సరిపోతుంది. తపాలాశాఖ కార్యాలయాల్లోనూ జీవన్​ ప్రమాణ్​ సేవలు అందించనున్నారు.

ఒకప్పుడు జీవన్​ ప్రమాణ్​ ధ్రువపత్రం పొందడం కోసం పింఛన్​దారులు మీ-సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఒక్కోసారి వేలిముద్రలు సరిపోక సాంకేతిక సమస్యలూ తలెత్తుతాయి. ఇప్పుడు తపాలాశాఖ ఇంటి వద్దకే వచ్చి సేవలందించడం వల్ల పింఛన్​దారుల ఇబ్బందులు తీరనున్నాయి.

ఇదీ చదవండిఃఅడవిపందుల నియంత్రణపై కసరత్తు... వెర్మిన్​ జాబితాలో చేర్చే యోచన

ABOUT THE AUTHOR

...view details