రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని మ్యాన్ హోల్స్ పలు ప్రాంతాల్లో పనిచేయక రోడ్లు జలమయమయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ అన్నారు. 48 గంటల నుంచి నేల తడిగా ఉండడం వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునగుతున్నాయన్నారు. వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదరవుతున్నాయన్నారు. పలుచోట్ల చెట్లు నెేలకూలి కూడా ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఈ సమస్యలను నేరుగా పరిశీలించిన ఆయన అన్ని విభాగాల వారు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని వివరించారు.
వర్షాలతో నగరవాసులకు ఇబ్బందులు:దానకిశోర్
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం సతమవుతోందని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ అన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
వర్షాలతో నగరవాసులకు ఇబ్బందులు:దాన కిశోర్