CC Cameras Are Not Working: గతేడాది గణాంకాల ప్రకారం నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో లక్షా 05వేల 97 సీసీ కెమెరాలున్నాయి. వీటిలో 4వేల 402 పనిచేయట్లేదంటూ 2022 జులై 11న సమాచార హక్కుచట్టం ద్వారా బహిర్గతమైంది. గ్రేటర్ పరిధిలో 9 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. పోలీసు యంత్రాంగం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రజలు, కాలనీ సంఘాలు, వ్యాపారుల సహకారంతో లక్ష్యాన్ని పూర్తిచేశారు.
కానీ! క్రమంగా సీసీ కెమెరాల నిర్వహణపై పర్యవేక్షణ కొరవడటంతో పలుచోట్ల కెమెరాలు మసకబారుతున్నాయి. నగరాల్లో అభివృద్ధి పనుల కారణంగా తరచూ సీసీ కెమెరాల వైర్లు తెగిపోతుంటే, పలు ప్రాంతాల్లో కోతులు వాటిని కొరికేస్తుండటంతో సమస్య మరింత జటిలంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. సంబంధిత పోలీస్‌స్టేషన్‌లోని అధికారులు గుర్తించినపుడు వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు.