కొవిడ్ వంటి మహమ్మారి నుంచి రక్షించుకోవడం కోసం సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా ఎస్మార్క్ ఆర్ఆర్ టెండర్స్ సంస్థ విభిన్న రకాలలో కొవిడ్ రక్షణాత్మక దుస్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొవిడ్ వచ్చినప్పుడు కేవలం పీపీఈ కిట్స్ ప్రాధాన్యంతో కేవలం డాక్టర్ కిట్స్ మాత్రమే తయారు చేసేవారు. ప్రస్తుతం వీటి ప్రాధాన్యత పెరగడం వల్ల వారి వారి అవసరాలకు అనుగుణంగా కొవిడ్ రక్షణాత్మక దుస్తులను రూపొందిస్తున్నారు.
14 రకాల్లో...
ప్రస్తుతం ఎస్మార్క్ సంస్థ 14 రకాలైన కొవిడ్ రక్షణాత్మక దుస్తులను రూపొందించి వాటిని దేశవిదేశాలలో విక్రయిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ వరకాంతం కలహర్ రెడ్డి తెలిపారు. 95 జీఎస్ఎం ఫ్యాబ్రిక్‌తో దుస్తులు రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో వైద్యులకు, కరోనా పేషెంట్లకు, ఔట్‌పేషెంట్లకు, ఎమర్జెన్సీ ట్రావెల్స్... ఇలా 14 రకాలైన రక్షణాత్మక దుస్తులను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.