తెలంగాణ

telangana

ETV Bharat / state

CHALLANS: మూడు కమిషనరేట్లలో ఉల్లంఘనలపై వేర్వేరు జరిమానాలు - hyderabad traffic rules

నగరంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై జరిమానాలు విధిస్తున్నారు.. ఇవి ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంటున్నాయని, నిబంధనలు సైతం నగరంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

CHALLANS
ట్రాఫిక్‌ ఉల్లంఘనలు

By

Published : Jul 30, 2021, 10:21 AM IST

మోటార్‌ వాహన చట్టం (Motor vehicle law) ప్రకారం శిరస్త్రాణం (Helmet) ధరించకుంటే రూ.100, మితిమీరిన వేగంతో వెళ్తే రూ.1000, ఒకే బైక్‌పై ముగ్గురు వెళితే రూ.1000, ఇలా ప్రతి ఉల్లంఘనకు ఒక జరిమానా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే చట్టం ఉన్నా... మూడు కమిషనరేట్లలో ట్రాఫిక్‌ పోలీసులు (Traffic Police) ఒకే తరహా ఉల్లంఘనకు వేర్వేరు జరిమానాలు (CHALLANS) విధిస్తున్నారు.

హైదరాబాద్‌ కమిషనరేట్‌లో దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎస్సార్‌నగర్‌ వరకూ, జూబ్లీహిల్స్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు బైక్‌ను నడిపేవారు మాత్రమే శిరస్త్రాణం ధరిస్తే సరిపోతుంది. హబ్సిగూడ దాటితే రాచకొండ పోలీసులు, మూసాపేట మొదలైతే సైబరాబాద్‌ పోలీసులు వెనుక కూర్చున్నవారు శిరస్త్రాణం ధరించకపోతే జరిమానా విధిస్తున్నారు.

● కోఠి, ఆబిడ్స్‌, నాంపల్లి, మెహిదీపట్నం నుంచి ఐటీ ఉద్యోగులతో పాటు, భార్యాభర్తలు, రోజువారీ కూలీలు ఒకే బైక్‌పై మెహదీపట్నం టోలీచౌకీ మీదుగా మాదాపూర్‌, గచ్చిబౌలి, లింగంపల్లి వరకూ రోజూ రాకపోకలు సాగిస్తుంటారు. బైక్‌పై వెనుక కూర్చున్నవారు శిరస్త్రాణం (Helmet) ధరించకుండా వెళ్తుంటే ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా (CHALLANS) విధిస్తున్నారు.

● బైక్‌ హ్యాండిల్‌కు రెండు అద్దాలు తప్పనిసరిగా ఉండాలని.. లేకపోతే సైబరాబాద్‌ పోలీసులు జరిమానాలు (CHALLANS) విధిస్తున్నారు. హైదరాబాద్‌, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ఒక హ్యాండిల్‌కు అద్దమున్నా సరేనని వదిలేస్తున్నారు.

● ప్రధాన ప్రాంతాల్లో రహదారులపై కార్లు, బైకులు నిలిపితే చట్టప్రకారం తప్ఫు. జరిమానా విధించినా బాధ్యులెవరూ పోలీసులను ప్రశ్నించబోరు. ఇందుకు విరుద్ధంగా గల్లీలు, అనుసంధాన రహదారులపై కార్లు, బైకులు, జీపులు ఇలా ఎలాంటి వాహనం ఉంచినా జరిమానాలు (CHALLANS) విధిస్తున్నారు.

శిరస్త్రాణం ధరించని కేసులిలా..

కమిషనరేట్‌ 2018 2019 2020 (లక్షల్లో)
హైదరాబాద్‌ 29.37 33.19 40.17

అదేపనిగా ఫొటోలు తీస్తూ...

శిరస్త్రాణం ధరించని వారిని గుర్తించేందుకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలో కూడళ్ల వద్ద, ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరాలున్నాయి. ఈ కెమెరాలు ఫొటోలు తీస్తున్నాయి. అవికాకుండా అదనంగా హోంగార్డులు, కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు ప్రధాన ప్రాంతాల్లో అదేపనిగా ఫొటోలు తీస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌జాంలను పట్టించుకోకుండా కేవలం ఫొటోలు తీయడంపైనే దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పొరపాటున శిరస్త్రాణం ధరించకుండా రోడ్డుపైకి వచ్చిన వాహనదారుడిని.. ప్రతి కూడలి వద్ద సిబ్బంది ఫొటో తీస్తుండడంతో ఒకేసారి వరుస జరిమానాలు పడుతున్న ఘటనలు ఉన్నాయి.

ఇదీ చూడండి:రోడ్డు భద్రతపై చిన్నారులకు వినూత్న శిక్షణ

CHALLANS: తప్పులు తెలుసుకొని.. సరిదిద్దుకుంటారనే జరిమానాలు!

ABOUT THE AUTHOR

...view details