కరోనాతో మృతి చెందిన వారి కుటంబ సభ్యులను అధికారులు హోమ్ క్వారంటైన్ చేయలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జియాగూడ ఇందిరానగర్‌లో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెంది ఐదురోజులు అవుతోంది. అయినా వారి ఇంటికి హోమ్ క్వారంటైన్, బ్యారికేడ్లు ఏర్పాటు చేయలేదు. మృతుని కుటుంబ సభ్యులకు కొవిడ్-19 పరీక్షలు సైతం చేయలేదని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'కరోనాతో మృతి.. కుటుంబ సభ్యులకు క్వారంటైన్ లేదు'
తమ ప్రాంతంలో కరోనా వచ్చినా పట్టించుకోవడం లేదని జియాగూడలోని ఇందిరానగర్ వాసులు భయాందోళన చెందుతున్నారు. ఐదు రోజుల క్రితం ఓ వ్యక్తి కరోనా పాజిటివ్‌తో మృతి చెందాడని, అయినా మృతుని కుటుంబ సభ్యులను అధికారులు హోమ్ క్వారంటైన్ చేయలేదని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనాతో మృతి చెందినా.. వారిని హోమ్ క్వారంటైన్ చేయలేదు
కనీసం వారిని హోమ్ క్వారంటైన్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఐదు రోజులుగా ఆ కుటుంబ సభ్యులు బయట తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను ఈ విషయం గురించి ఆరా తీయగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని అక్కడి వారు అంటున్నారు.
ఇదీ చూడండి :భార్యకు కరోనా వచ్చిందని తెలిసి... భర్త హఠాన్మరణం