ఈసారి రాఖీ పండుగకు కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం దృష్ట్యా... బయటకు వెళ్లి రాఖీలు కొనే పరిస్థితి లేదు. అధిక శాతం గృహిణులు ఇళ్ళల్లో రాఖీ మెటీరియల్స్ తీసుకొచ్చి వాటితోనే అందమైన రాఖీలు తయారు చేశారు. అవే రాఖీలను చెల్లెళ్లు, అక్కలు తమ అన్నలు, తమ్ముళ్లకు కట్టి సోదర బంధాన్ని చాటుకున్నారు.
రాఖీల కోసం బయటికెళ్లలేదు..కానీ పండుగ జరుపుకున్నారు - ఇంట్లోనే రాఖీల తయారు ఫెస్టివల్ నిర్వహణ
రాష్ట్రంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో గతంలో నిర్వహించిన రాఖీ పండుగకు భిన్నంగా ఈ వేడుకలు సాగాయి. ప్రత్యేకించి హైదరాబాద్ జంట నగరాల్లో ఇళ్లలోనే సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టారు.
![రాఖీల కోసం బయటికెళ్లలేదు..కానీ పండుగ జరుపుకున్నారు Didn't go out for Rakhi purchase but the festival was celebrated at hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8282084-999-8282084-1596465138305.jpg)
రాఖీల కోసం బయటికెళ్లలేదు..కానీ పండుగ జరుపుకున్నారు
రాఖీల కోసం బయటికెళ్లలేదు..కానీ పండుగ జరుపుకున్నారు
అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన ఈ రాఖీ వేళ.. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో కూడా "స్టే హోం-స్టే సేఫ్" అన్న నినాదంతో ఈ రాఖీ పర్వదినోత్సవం కొనసాగడం ఈ సారి ప్రత్యేకత. కరోనా మహమ్మారి దేశం విడిచి పారిపోవాలని సోదరీ-సోదరీమణులు కోరుకున్నారు.
ఇదీ చూడండి :ప్లాస్మా దాతలతో కలిసి గవర్నర్ వేడుకలు