కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ డీఐసీసీఐ బృందం ప్రతినిధులు హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌లను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలలో వ్యాపార నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో వారి సేవలను మంత్రి కొనియాడారు.
వ్యాపార నాయకత్వంలో ఎనలేని సేవలు : హరీశ్ రావు - dicci members meet minister harish rao
నూతన ఏడాది సందర్భంగా హైదరాబాద్‌లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌లను కలిసి తెలంగాణ డీఐసీసీఐ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలలో వ్యాపార నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు.
![వ్యాపార నాయకత్వంలో ఎనలేని సేవలు : హరీశ్ రావు dicci members meet minister harish rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10142994-732-10142994-1609946238876.jpg)
ఎంఎస్ఎంఈ రంగానికి తోడ్పాటును అందించేందుకు రాయితీలను సకాలంతో విడుదల చేయాలని మంత్రికి డీఐసీసీఐ బృందం సభ్యులు విజ్ఞప్తి చేశారు. టీఎస్ఐఐసీ భూమి వడ్డీరేట్లపై చర్చించినట్లు వారు తెలిపారు. తమ అభ్యర్థనలకు మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారతదేశ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కిరణ్, డీఐసీసీఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షురాలు అరుణ దాసరి , రాష్ట్ర గిరిజన అధ్యక్షుడు రమేష్ నాయక్, డీఐసీసీఐ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్, రాష్ట్ర ఆహార ప్రాసెసింగ్ అధ్యక్షుడు మున్నయ్య, రాష్ట్ర సమన్వయకర్త పరమేశ్ పాల్గొన్నారు.