CM KCR: ఈ నెల 9న డయాగ్నోస్టిక్ కేంద్రాల ప్రారంభం - diagnostic centers opening on june 9
12:30 June 06
డయాగ్నోస్టిక్ కేంద్రాల ప్రారంభోత్సవం 9కి వాయిదా
జిల్లాల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాల ప్రారంభోత్సవం ఈ నెల 9కి వాయిదా పడింది. సోమవారం నుంచి అందుబాటులోకి తేవాలని ముందుగా భావించినా.. మళ్లీ మార్చారు. బుధవారం నాడు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా నిర్ణయించారు.
19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఒకేసారి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆయా జిల్లాల్లోని కేంద్రాలను మంత్రులు ప్రారంభించనున్నారు. మంత్రులు లేనిచోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి.. వారి చేతుల మీదుగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎవరెవరు ఎక్కడ పాల్గొనాలనే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
ఇదీ చూడండి: CM KCR: పేదలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో సర్కారు కృషి