అమీర్‌పేట్‌లోని ధరంకరం కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి రోడ్లపై వ్యాపారులు చెత్త వేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల దోమల బెడద ఎక్కువగా ఉందని వాపోయారు. ముఖ్యంగా కాలనీలో వీధి కుక్కల స్వైర్య విహారం చేస్తున్నాయని తెలిపారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరసన చేస్తామని వెల్లడించారు.
కాలనీలో సమస్యలు పరిష్కరించాలని ఆందోళన - colony issues in ameerpet
తమ కాలనీలో పలు సమస్యలు పెండింగ్లో ఉన్నాయని... అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదని నిరసిస్తూ అమీర్‌పేట్‌లోని ధరంకరం వాసులు నిరసన తెలిపారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు.
'మా కాలనీ సమస్యలు వెంటనే తీర్చండి'
TAGGED:
colony issues in ameerpet