హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో 6 నెలల వాహన పన్నులను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం ముందు భారీగా బస్సులు, ఇతర వాహనాలు నిలిపివేశారు. కొవిడ్ కారణంగా మూడు నెలలుగా తమకు ఆదాయం లేదని.. ప్రభుత్వం వాహన పన్నులను రద్దు చేసి తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.
వాహన పన్నులు రద్దుచేయాలని ట్రావెల్స్ నిర్వాహకుల ఆందోళన - ఖైరతాబాద్‌లో టూర్స్ అండ్ ట్రావెల్స్ ధర్నా వార్తలు
కరోనా నేపథ్యంలో వాహన పన్నులను రద్దు చేయాలంటూ ఖైరతాబాద్‌లోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు ఆందోళనకు దిగారు. ఆరు నెలల పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వాహన పన్నులు రద్దు చేయాలంటూ ధర్నా
ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా పోలీసులు, ట్రావెల్స్ నిర్వాహకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీచూడండి: ఇంజినీరింగ్ కళాశాలల వ్యూహం.. ఇలా వేసి అలా తీసుకుంటున్నాయి