తెలంగాణ

telangana

ETV Bharat / state

Dharmapuri Arvind: 'రాష్ట్రమంతా అకాల వర్షాలు.. సీఎం, వ్యవసాయ మంత్రి మాత్రం ఫాంహౌస్​లో'

BJP MP Dharmapuri Arvind Criticized CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్​పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కిసాన్ సర్కారని చెప్పుకోవడానికి కేసీఆర్‌కు ఏం అర్హత ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రమంతా మునిగిపోతుంటే సీఎం, వ్యవసాయశాఖ మంత్రి వారి వారి ఫామ్‌హౌస్‌లు చూసుకుంటున్నారని మండిపడ్డారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన బీఆర్​ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.

Dharmapuri Arvind
Dharmapuri Arvind

By

Published : Apr 27, 2023, 7:31 PM IST

BJP MP Dharmapuri Arvind Criticized CM KCR: రాష్ట్రమంతా అకాల వర్షాలతో మునిగిపోతుంటే.. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం తమ ఫామ్​ హౌస్​లను జాగ్రత్తగా చూసుకుంటున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఆరోపించారు. హైదరాబాద్​లోని రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్​, బీఆర్​ఎస్​ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

రాష్ట్రంలో పలు చోట్ల అకాల వర్షాలతో విపరీతమైన పంట నష్టం వాటిల్లిందని ఎంపీ ధర్మపురి అర్వింద్​ పేర్కొన్నారు. ఈ వర్షాలపై వాతారవణ శాఖ ముందుగానే హెచ్చరించిందని.. అయితే ప్రభుత్వం అందుకు తగిన చర్యలను చేపట్టలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్​కు రాష్ట్రంపై ప్రేమ.. రైతులపై చిత్త శుద్ధి ఉంటే ముందగానే చర్యలు తీసుకునే వారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలకు దెబ్బ తిన్న పంటలకు గతంలో ఇస్తామని చెప్పిన రూ. 10వేలు సాయం సరిపోదని.. దాని కన్నా ఎక్కువగా రూ. 50 వేలు పరిహారం రైతులకు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

కేసీఆర్​ కంటే పెద్ద ఫాంహౌస్​ నిరంజన్​ రెడ్డి దగ్గర: గతంలో సీఎం కేసీఆర్​ చెప్పినట్లు చైనా క్లౌడ్​ బరస్ట్​ వల్ల.. వచ్చిన వర్షాలు కావని తెలిపారు. ముఖ్యమంత్రి మహారాష్ట్రకు తిరుగుతుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో డ్యాన్సులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రమంతా మునిపోతుంటే తమకు ఏం సంబంధం లేదు అన్నట్లు సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి ఫాంహౌస్​లలో ఉన్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ మంత్రికి సీఎం కంటే పెద్ద ఫాంహౌస్​ ఉందని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. కిసాన్​ సర్కారనీ చెప్పుకోవడానికి కేసీఆర్​ ఏ అర్హత ఉందన్నారు.

రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉందని వెల్లడించారు. దీని ప్రకారం చూస్తే సీఎంగా కేసీఆర్​ కొనసాగడానికి అనర్హుడు అనడంలో సందేహం లేదని వివరించారు. పంట నష్టంపై గవర్నర్​ నివేదికలు తెప్పించుకొని.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్​ఎస్​ ఎందుకు పెట్టుకున్నావు కేసీఆర్​ అంటూ.. దేశంలో తనను ఎవరైనా పట్టించుకుంటారా అని ప్రశ్నించారు. కుమారుడు, కుమార్తెను కాపాడుకోవడం కోసమే బీఆర్​ఎస్​ను పెట్టి.. దేశమంతటా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ. 3 లక్షల వరకు వడ్డీలేని రుణాలను ఇస్తున్నారని చెప్పారు. అప్ కీ బార్​ కిసాన్​ సర్కారు అంటే.. జైలు సర్కారు కాదన్నారు. కేటీఆర్​ భూమి మీద నీకే సెంటిమెంట్​ ఉంటుందా.. రైతు కూలీలకు ఉండదా అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details