ధరణి పోర్టల్ నిర్వహణ కోసం ఈ నెల 10 నుంచి శిక్షణా కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లాకు ఒకరు చొప్పున జిల్లా స్థాయి సాంకేతికాధికారులకు శనివారం నుంచి వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆ అధికారి ద్వారా ఆయా జిల్లాల్లోని తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లు, సాంకేతిక సిబ్బందికి శిక్షణ ఇస్తారు.
ధరణి పోర్టల్ నిర్వహణ కోసం శనివారం నుంచి శిక్షణ - ధరణి పోర్టల్ నిర్వహణ కోసం శిక్షణ వార్తలు
ధరణి పోర్టల్ నిర్వహణ కోసం అక్టోబర్ 10 నుంచి జిల్లా స్థాయి సాంకేతికాధికారులకు వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆ అధికారి ద్వారా ఆయా జిల్లాల్లోని తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లు, సాంకేతిక సిబ్బందికి శిక్షణ ఇస్తారు.
ధరణి పోర్టల్ నిర్వహణ కోసం శనివారం నుంచి శిక్షణ
కొత్త ఆర్వోఆర్ చట్టం ప్రకారం ధరణి పోర్టల్ నిర్వహణ, రిజిస్ట్రేషన్లు, ఆ వెంటనే మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి:ఆస్తుల రక్షణకే ధరణి పోర్టల్, ఎల్ఆర్ఎస్: మంత్రి శ్రీనివాస్ గౌడ్