DH on Corona Third Wave: రాష్ట్రంలో కరోనా మూడో దశ పూర్తిగా తగ్గిందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్ ఆంక్షలు అమలులో లేవన్నారు. జనవరి 28న మూడోదశ ఉద్ధృతి పెరిగిందన్న డీహెచ్... టీకా తీసుకున్నవారిలో ప్రభావం తక్కువగా ఉందని వివరించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగా ఉందని.. అత్యధిక పాజిటివిటీ రేటు 5 శాతానికి వెళ్లిందని శ్రీనివాసరావు తెలిపారు.
ఐటీ సంస్థలు వర్క్‌ఫ్రం హోమ్ విరమించుకోవచ్చని డీహెచ్ సూచించారు. అన్ని సంస్థలు వంద శాతం సిబ్బందితో పనిచేయవచ్చని.. పూర్తి సంఖ్యలో కార్యాలయాలకు రావచ్చని వెల్లడించారు. కేసులు తగ్గినా మాస్కులు ధరించాలని.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 5 కోట్ల మందికి పైగా టీకాలు పంపిణీ చేశామని.. 82శాతం మందికి రెండు డోస్‌లు పూర్తయ్యాయని వివరించారు.
రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2శాతం కంటే తక్కువ. అత్యధిక పాజిటివిటీ రేటు 5 శాతానికి వెళ్లింది. రాష్ట్రంలో కరోనా మూడో దశ పూర్తిగా తగ్గింది. ఎలాంటి కొవిడ్ ఆంక్షలు అమలులో లేవు. కొవిడ్ వల్ల రెండేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఐటీ సంస్థలు వర్క్‌ఫ్రం హోమ్ విరమించుకోవచ్చు. అన్ని సంస్థలు వంద శాతం పనిచేయవచ్చు.
-- శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు