ఆన్‌లైన్ రుణయాప్‌లపై తీసుకున్న చర్యలపై హైకోర్టుకు డీజీపీ మహేందర్ రెడ్డి నివేదిక సమర్పించారు. రుణ యాప్‌లపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. వాటికి సంబంధించి 56 కేసులు నమోదు చేసి... రుణాల కోసం వేధిస్తున్న 118 మొబైల్ నంబర్లను గుర్తించినట్లు ఉన్నత న్యాయస్థానానికి డీజీపీ వెల్లడించారు. 290 రుణ యాప్‌లను గుర్తించి నిలిపివేసినట్లు తెలిపారు.
ఆన్‌లైన్ రుణయాప్‌లపై హైకోర్టుకు డీజీపీ నివేదిక - DGP's report to the High Court on online loan applications
ఆన్‌లైన్ రుణయాప్‌లపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. వాటిపై తీసుకున్న చర్యలపై ఉన్నత న్యాయస్థానానికి డీజీపీ మహేందర్ రెడ్డి నివేదిక సమర్పించారు. 290 రుణయాప్‌లను గుర్తించి నిలిపివేసినట్లు డీజీపీ తెలిపారు.
హైకోర్టుకు డీజీపీ నివేదిక
ఈ మోసంలో భారత్‌తో పాటు చైనా, ఇతర దేశీయుల ప్రమేయం ఉందని... ఆర్బీఐ అనుమతి లేని రెండు ఎన్ఎఫ్బీఐలను గుర్తించినట్లు ధర్మాసనానికి డీజీపీ వివరించారు. అనుమతిలేని ఎన్ఎఫ్బీఐలపై ఏం చర్యలు తీసుకున్నారని డీజీపీని ప్రశ్నించిన హైకోర్టు... మరిన్ని వివరాలతో 4 వారాల్లో మరో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి:ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటా: నోముల భగత్