ఈ సిగరెట్లపై కేంద్రం నిషేధం విధించిన తరుణంలో.. వ్యాపారులు తమ వద్ద ఉన్న ఈ సిగరెట్లు, ఈ-హుక్కాను సంబంధిత పోలీస్ స్టేషన్లలో అప్పజెప్పాలని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఒకవేళ ఎవరిదగ్గరైనా ఈ-సిగరెట్లు.. దానికి సంబంధించిన ఉత్పత్తులు ఉంటే వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, ఎగుమతి, దిగుమతి, విక్రయాలు, నిల్వ చేసుకోవడం లాంటి వాటిపై కేంద్రం నిషేధం విధించిందని...ఈ నెల 18వ తేదీ నుంచే ఇది అమల్లోకి వచ్చిందని డీజీపీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారు జరిమానా, జైలు పాలవుతారని అన్నారు. పోలీసు అధికారులు ఈ-సిగరెట్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. ఈ సిగరెట్ల వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి పాఠశాల, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు అవగాహన కల్పించాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు.
ఈ సిగరెట్లు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: డీజీపీ - ఈ సిగరెట్లు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: డీజీపీ
ఎవరిదగ్గరైనా ఈ సిగరెట్ల ఉత్పత్తులు ఉంటే... వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్రెడ్డి హెచ్చరించారు. వాటిని వెంటనే పోలీస్ స్టేషన్లలో అప్పజెప్పాలని ఆదేశించారు.
ఈ సిగరెట్లు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: డీజీపీ