పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలు చెల్లవు: డీజీపీ - DGP said police officers issued Permit letters are invalid
![పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలు చెల్లవు: డీజీపీ DGP said police officers issued Permit letters are invalid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6542636-485-6542636-1585149078935.jpg)
20:35 March 25
పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలు చెల్లవు: డీజీపీ
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్నందున ఎవరూ ఇళ్లు విడిచి వెళ్లొద్దని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. వసతిగృహాల్లో ఉండేవాళ్లను ఖాళీ చేయించొద్దని తెలిపారు. హాస్టళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని డీజీపీ అధికారులను ఆదేశించారు. పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలు ఏవీ కూడా చెల్లవని పేర్కొన్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు వసతిగృహాల నిర్వాహకులతో మాట్లాడాలని సూచించారు.
ఇప్పటికే వందల సంఖ్యలో అనుమతి పత్రాలను పోలీసులు జారీచేశారు. అనుమతి పత్రాలతో వెళ్లిన విద్యార్థులు ఏపీ సరిహద్దుల్లో పడిగాపులు పడుతున్నారు.