DGP rejoined in duties: డీజీపీ మహేందర్ రెడ్డి విధుల్లో చేరారు. రెండు వారాల సెలవు ముగియడంతో తిరిగి శనివారం విధుల్లో చేరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇంట్లో జారి కింద పడటంతో మహేందర్ రెడ్డి ఎడమ భుజం ఎముక విరిగింది. దీంతో రెండు వారాల పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఫిభ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు మహేందర్ రెడ్డి సెలవు పెట్టారు.