రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపై డీజీపీ కార్యాలయ అధికారులు సమీక్షిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు గల కారణాలు... వాటిని అదుపుచేయడం ఎలా అనే అంశాలపై లోతైన పరీశీలన చేస్తున్నారు. ప్రమాదాల తరువాత కేసులు నమోదు చేయడం కాకుండా... ముందస్తుగానే పరిష్కారాలను గుర్తించేందుకు గల మార్గాలపై దృష్టి సారిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల కసరత్తు - DGP OFFICE REVIEW ON ROAD ACCIDENTS
రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తున్న పరిస్థితులు, ప్రమాద మరణాలపై డీజీపీ కార్యాలయం పరిశీలిస్తోంది. సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్... నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా స్వయంగా మహేందర్ రెడ్డి స్వయంగా సమీక్షిస్తున్నారు.
'రోడ్డు ప్రమాదాల అంశాలపై లోతైన పరిశీలన'
ప్రమాద మరణాలకు గల కారణాలను సంబంధిత ఎస్హెచ్వో నుంచి సేకరించి విశ్లేషించే ప్రక్రియను డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. విషయ తీవ్రతను బట్టి అవసరమైతే రవాణ శాఖ అధికారులకు లేఖలు రాస్తున్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లు 870 ఉన్నట్లు గతేడాది గుర్తించారు. వీటిల్లోని లోపాలన్ని సవరించే విషయంలో సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తున్నారు.
ఇవీ చూడండి : వరంగల్ అర్బన్ జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురి దుర్మరణం
Last Updated : Feb 13, 2020, 9:35 AM IST