తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్బీనగర్​ ఠాణాను తనిఖీ చేసిన డీజీపీ మహేందర్​రెడ్డి - పోలీస్​ దళాల అధిపతి

డీజీపీ మహేందర్​ రెడ్డి ఇవాళ హైదరాబాద్​ నగర శివారులోని ఎల్బీనగర్​ పోలీస్​స్టేషన్​ను సందర్శించారు. సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ, సీసీ కెమెరాల వినియోగంపై మహేందర్​రెడ్డి ఆరా తీశారు.

ఎల్బీనగర్​ ఠాణాను తనిఖీ చేసిన డీజీపీ మహేందర్​రెడ్డి

By

Published : Jul 17, 2019, 7:50 PM IST

ఎల్బీనగర్​ ఠాణాను తనిఖీ చేసిన డీజీపీ మహేందర్​రెడ్డి

డీజీపీ మహేందర్​రెడ్డి గత రెండు రోజులుగా పోలీస్​ స్టేషన్​లను తనిఖీ చేస్తున్నారు. నిన్న సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలోని చందానగర్​ పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేసిన డీజీపీ.. ఇవాళ రాచకొండ పరిధిలోని ఎల్బీనగర్​ ఠాణాను సందర్శించారు. ఫిర్యాదుదారులకు ఎలాంటి సహకారం అందిస్తున్నారు... కేసుల విచారణలో చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్​ సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఎల్బీనగర్​ ఠాణా పరిధిలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ప్రజలకు మరింత చేరువకావాలని సూచించారు. డీజీపీ వెంట రాచకొండ కమిషనర్​ మహేశ్​ భగవత్​తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details