తెలంగాణ

telangana

ETV Bharat / state

లొంగిపోయిన మావోయిస్టు సావిత్రి.. దళం సభ్యులకు పోలీస్‌ బాస్ వార్నింగ్

DGP Mahender Reddy on Mavoist savitri మావోయిస్టు కీలక నేత సావిత్రి రాష్ట్ర పోలీసులకు లొంగిపోయారు. 30ఏళ్లుగా ఆమె దళంలో కీలక పాత్ర షోషించిందని.. పోలీసులపై జరిగిన 9 దాడుల్లో చురుగ్గా వ్యవహరించిందని డీజీపీ మహేందర్‌రెడ్డి వివరించారు. ఆమెపై 10 లక్షలరివార్డు ఉన్నట్లు పేర్కొన్నారు. మిగతా సభ్యులందరూ లొంగిపోవాలని సూచించారు.

DGP
DGP

By

Published : Sep 21, 2022, 5:09 PM IST

Updated : Sep 21, 2022, 6:19 PM IST

DGP Mahender Reddy on Mavoist savitri రాష్ట్రంలో మావోయిస్టులు ఎప్పుడైనా ప్రవేశించే అవకాశం ఉందని అందుకే అప్రమత్తంగా ఉన్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలోకి అడుగుపెడితే... కచ్చితంగా పట్టుకుంటామని స్పష్టం చేశారు. మావోయిస్టు కీలక నేత సావిత్రి రాష్ట్ర పోలీసులకు లొంగిపోయారు. 30ఏళ్లుగా ఆమె దళంలో కీలక పాత్ర షోషించిందని.. పోలీసులపై జరిగిన 9 దాడుల్లో చురుగ్గా వ్యవహరించిందని డీజీపీ మహేందర్‌రెడ్డి వివరించారు.

తన భర్త, మావోయిస్టు కీలక నేత రామన్న చనిపోయినప్పుడు కనీసం సమాచారం ఇవ్వలేదనే మనస్తాపం సహా మారిన పరిణామాలు, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి నేపథ్యంలో... సావిత్రి జనజీవనస్రవంతిలో కలుస్తున్నారని తెలిపారు. సావిత్ర బాటలోనే సీపీఐ మావోయిస్టు పార్టీలో ఉన్న ఆదివాసీలు అందరూ లొంగిపోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి కోరారు. ఆమెపై ఛత్తీస్‌గఢ్‌లో 10లక్షల రూపాయల రివార్డు ఉందని వెల్లడించారు.

అసలు ఎవరీ సావిత్రి...మావోయిస్టు దండకారణ్య కమిటీ సెక్రటరీ రామన్న భార్య సావిత్రి. 2019లో గుండెపోటుతో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో రామన్న చనిపోయారు. రామన్నపై గతంలో పోలీసులు రూ.40 లక్షల రివార్డు ప్రకటించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లో మోస్ట్‌వాంటెడ్‌గా రామన్న జాబితాలో ఉన్నారు. 1994లో దళం సభ్యురాలు సావిత్రిని రామన్న వివాహం చేసుకున్నారు. కానీ 2019లో గుండెపోటుతో ఛత్తీస్​గఢ్​ అడవుల్లో ప్రాణాలను విడిచారు. ప్రస్తుతం కిష్టారం ఏరియా కమిటీకి సెక్రటరీగా సావిత్రి వ్యవహరిస్తోంది.

''గతేడాది సావిత్రి కుమారుడు రంజిత్ లొంగిపోయారు. సావిత్రి, ఆమె కుమారుడు రంజిత్‌ ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్నారు. మిలిషియా సభ్యులతో సావిత్రి పనిచేశారు. కుంట ఏరియా కమిటీ ఇన్‌ఛార్జ్‌గా సావిత్రి పనిచేస్తున్నారు. 350 మంది గిరిజనులు మావోయిస్టుల్లో చేరడానికి కృషి చేశారు. సావిత్రి పాల్గొన్న 9 ఆపరేషన్లలో చాలా మంది పోలీసులు చనిపోయారు. 1992లో లింగన్‌పల్లిలో సావిత్రి పాల్గొన్న ఆపరేషన్‌లో 15 మంది చనిపోయారు. 2000లో ల్యాండ్‌మైన్‌ బ్లాస్ట్‌ ద్వారా ఐదుగురు పోలీసులు చనిపోయారు. 2007 లో కొత్తచెరువు ల్యాండ్‌మైన్‌ బ్లాస్ట్‌లో 15 మంది నాగా పోలీస్‌ బెటాలియన్‌ వాళ్లు చనిపోయారు. 2017లో 24 మంది సీఆర్పీఎఫ్‌ పోలీసులు చనిపోయారు. 2017లో మళ్లీ కొత్తచెరువు జరిగిన కాల్పుల్లో 12 మంది సీఆర్పీఎఫ్‌ పోలీసులు మృతిచెందారు.'' అని డీజీపీ వెల్లడించారు.

లొంగిపోయిన మావోయిస్టు సావిత్రి

1993లో సావిత్రి ఛత్తీస్‌గఢ్‌ కుంట దళంలో చేరారని డీజీపీ వెల్లడించారు. ఆ సమయంలో రామన్న మావోయిస్టు నాయకుడిగా పనిచేశారన్నారు. రామన్నతో సావిత్రికి వివాహం జరిగిందన్నారు. 30 ఏళ్లలో సావిత్రి 350 మంది ఆదివాసీలను మవోయిస్టులుగా చేర్పించారని తెలిపారు. కుంట దళంలో ఉన్న సావిత్రి పోలీసులకు లొంగిపోయారన్నారు. పోలీసులపై జరిపిన 9 ప్రధాన దాడుల్లో సావిత్రి పాల్గొన్నారని వివరించారు. మావోయిస్టు నేత రామన్న మూడేళ్ల క్రితం చనిపోయారని డీజీపీ పేర్కొన్నారు.

''సావిత్రి కుమారుడు రంజిత్ మావోయిస్టుగా పని చేసి ఏడాది క్రితం లొంగిపోయారు. భర్త రామన్న చనిపోయినప్పుడు సమాచారం ఇవ్వలేదని మావోయిస్టు నేతల వద్ద సావిత్రి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతలు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని సావిత్రి చెప్పారు. 3 దశాబ్దాలతో పోలిస్తే మావోయిజానికి క్రమంగా ఆదరణ తగ్గింది. మావోయిస్టుల బలవంతంగా కొంత మందిని దళంలో చేర్పిస్తున్నట్లు సావిత్రి చెప్పారు. రామన్న అనారోగ్యం పాలైనపుడు పట్టించుకోలేదని సావిత్రి వెల్లడించింది. ఎవరూ మావోయిస్టుల పట్ల ఆకర్షితులు కావొద్దని సావిత్రి కోరింది. దళంలో ఉన్న వాళ్లు ఎవరైనా సరే వెంటనే లొంగిపోవాలి. పునరావాస పథకం కింద వెంటనే ప్రభుత్వం తరపున లబ్ధి జరిగేలా చూస్తాం.'' - మహేందర్‌రెడ్డి, డీజీపీ

ప్రస్తుతం తెలంగాణ మావోయిస్టు కమిటీ ఇన్‌ఛార్జ్‌ కార్యదర్శిగా చంద్రన్న ఉన్నారని పోలీస్ బాస్ పేర్కొన్నారు. సావిత్రిపై ఛత్తీస్‌గఢ్‌లో రూ.10 లక్షల రివార్డ్ ఉందని డీజీపీ తెలిపారు. సావిత్రి మొత్తం ఛత్తీస్‌గఢ్‌లోని దళంలోనే పనిచేశారన్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీలో 13 మంది తెలుగు వాళ్లు ఉన్నారని వెల్లడించారు. 135 మంది తెలంగాణ వాళ్లు బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులుగా ఉన్నారని వివరించారు.

లొంగిపోయిన మావోయిస్టు సావిత్రి.. దళం సభ్యులకు పోలీస్‌ బాస్ వార్నింగ్

ఇవీ చూడండి:

Last Updated : Sep 21, 2022, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details