కిడ్నీ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా వ్యాయామం చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రలజీ... హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో నిర్వహించిన 5కే రన్‌ను ఆయన ప్రారంభించారు. జలవిహార్ నుంచి పీపుల్ ప్లాజా వరకు నిర్వహించిన పరుగులో దాదాపు 250 మందికి పైగా యువతి, యువకులు, కిడ్నీ వ్యాధి గ్రస్థులు పాల్గొన్నారు.
'వ్యాయామంతో కిడ్నీ వ్యాధులను అరికట్టొచ్చు' - hyderabad district latest news
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంబం సంతోషంగా ఉంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రలజీ... నెక్లెస్ రోడ్‌లో నిర్వహించిన 5కే రన్‌ను ఆయన ప్రారంభించారు.
'వ్యాయామంతో కిడ్నీ వ్యాధులను అరికట్టొచ్చు'
శరీరంలో ఉన్న అవయవాల్లో కిడ్నీ ప్రధానమైందని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గస్ట్రోయెంటెరోలజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రపంచ కిడ్ని దినోత్సవానికి ప్రతి సారి ఒక థీమ్ ఉంటుందని... ఈ సారి లీవింగ్ వెల్ కిడ్నీస్‌గా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు
ఇదీ చదవండి:లైవ్ అప్డేట్స్: ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్... పోటెత్తుతున్న పట్టభద్రులు