తెలంగాణ

telangana

ETV Bharat / state

హాజీపూర్​ బాధితులకు న్యాయం జరిగింది: డీజీపీ - nalgonda court death sentenced to srinivas reddy

హాజీపూర్ వరుస హత్యల కేసులో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.  విచారణలో భాగంగా చివరి వరకు నిలబడిన సాక్షులు, బాధిత కుటుంబ సభ్యులకు డీజీపీ కృజ్ఞతలు తెలిపారు.

dgp mahender reddy respond on hajipur veridict in Hyderabad
న్యాయం జరిగింది: డీజీపీ మహేందర్​ రెడ్డి

By

Published : Feb 6, 2020, 11:29 PM IST

Updated : Feb 6, 2020, 11:39 PM IST

డీజీపీ మహేందర్​ రెడ్డి హాజీపూర్ తీర్పుపై స్పందించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా చివరి వరకు నిలబడిన సాక్షులు, బాధిత కుటుంబ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కోర్టు వేగవంతంగా విచారణ జరిపి తీర్పు వెలువరించిందన్నారు.

సాక్ష్యాల సేకరణతో పాటు... శాస్త్రీయమైన పద్ధతిలో పోలీసు అధికారులు వేగంగా దర్యాప్తు చేశారని తెలిపారు. కేసును పర్యవేక్షించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్​తో పాటు... ఇతర పోలీస్ అధికారులను డీజీపీ అభినందించారు. నేరం చేసిన వాళ్లు తప్పించుకోకుండా పోలీస్ శాఖ పనిచేస్తోందని.. మహిళల భద్రత కోసం తాము కట్టుబడి ఉన్నామని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:మద్యం ఊరికే రాదు... మరి ఇలా కుళాయిల్లో వస్తే.!

Last Updated : Feb 6, 2020, 11:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details