తెలంగాణ

telangana

ETV Bharat / state

DGP: ప్రజా రక్షణే ప్రధాన ధ్యేయంగా పోలీసులు పనిచేయాలి: డీజీపీ - పుస్తకాన్ని ఆవిష్కరణలో డీజీపీ మహేందర్​ రెడ్డి

'ఆదర్శ పథంలో పోలీసు - సమగ్ర పరిశీలన' అనే పుస్తకాన్ని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. విశ్రాంత పోలీసు అధికారి తిరుపతి రెడ్డి రచించిన ఈ పుస్తకాన్ని హైదరాబాద్​లోని డీజీపీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో కలిసి విడుదల చేశారు.

DGP Mahender reddy
అభివృద్ధి పథంలో పోలీసు- సమగ్ర పరిశీలన అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి

By

Published : Jun 15, 2021, 7:34 PM IST

Updated : Jun 15, 2021, 9:42 PM IST

పోలీస్ శాఖలో చేపట్టిన సంస్కరణల వల్లే నేరాల ఛేదనలో తెలంగాణ పోలీసులు ముందున్నారని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి పోలీసు అధికారిపై ఉందని పేర్కొన్నారు. విశ్రాంత పోలీసు అధికారి తిరుపతి రెడ్డి రచించిన ఆదర్శ పథంలో పోలీసు- సమగ్ర పరిశీలన అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారని రచయిత పుస్తకంలో ప్రస్తావించారు. సీసీ కెమెరాల ఏర్పాటు.. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల పోలీసింగ్​లో వచ్చిన మార్పులు, ఫలితాల గురించి రచయిత తిరుపతి రెడ్డి పుస్తకంలో వివరించారు. పోలీసు వ్యవస్థ ప్రజలతో ఎలా మమేకం కావాలి.. ఎలా పనిచేయాలి అనే అంశాలను తిరుపతి రెడ్డి తన పుస్తకంలో వివరించారని మహేందర్ రెడ్డి తెలిపారు.

ప్రపంచంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అతి పురాతన వాటిలో ఒకటని.... హైదరాబాద్ కొత్వాల్​గా పనిచేసిన రాజబహదూర్ వెంకటరామిరెడ్డి ఆధునిక పోలీసింగ్​కు శ్రీకారం చుట్టారని డీజీపీ గుర్తుచేశారు. పోలీసుశాఖలోని హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని చదవాలని సూచించారు. దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా లక్షా 50 వేల మంది మరణిస్తున్నారని.. ఈ కేసుల దర్యాప్తు, నిందితులకు ఎలా శిక్ష పడాలి అనే అంశాలను తెలియజేస్తూ మరో పుస్తకం వెలువరించడం పట్ల రచయితను డీజీపీ అభినందించారు. పౌర సమాజానికి అవసరమయ్యేలా ఎన్నో అంశాలను ఈ పుస్తకంలో పొందుపర్చినట్లు రచయిత తిరుపతి రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:Etela: తెరాస పునాదులు ఎవరూ పెకిలించలేరు : వినయ భాస్కర్

Last Updated : Jun 15, 2021, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details