విధినిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. కొవిడ్ నియంత్రణకు విధులు నిర్వహిస్తునే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని పోలీసు కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్ ఇంఛార్జ్, అడిషనల్ ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పాజిటివ్ వస్తే తగిన వైద్య సేవలందించండి : డీజీపీ - కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న డీజీపీ
కొవిడ్ నియంత్రణకు విధులు నిర్వహిస్తున్న పోలీసులు తమ ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఇంఛార్జ్‌లు, అదనపు ఎస్పీలతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే ప్రారంభం నుంచే తగు వైద్య చికిత్సలు అందించాలని కంట్రోల్ రూమ్ అధికారులను ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వారికి ప్రత్యేక ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేసి మందులు, బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని స్పష్టం చేశారు. ఆరోగ్య పర్యవేక్షణతో పాటు పోలీస్ యూనిట్లలో బీపీ, షుగర్, ఇతర లక్షణాలున్న అధికారులకు వైరస్ సోకుకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, డీఐజీ బి.సుమతి, తదితరులు పాల్గొన్నారు.