తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రియా సంఘ్​ సొసైటీని అభినందించిన డీజీపీ మహేందర్​రెడ్డి - lock down updates

లాక్​డౌన్​ కాలంలో ఎంతో మందికి ఆహారమందించి ఆదుకున్న క్రియా సంఘ్​ సొసైటీని డీజీపీ మహేందర్​రెడ్డి ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి బృందానికి ప్రశంసాపత్రం అందించారు. సంస్థ చేసిన సేవలను పోలీసు ఉన్నతాధికారులు కొనియాడారు.

dgp mahender reddy gave a appreciation to kriya seva sangh
dgp mahender reddy gave a appreciation to kriya seva sangh

By

Published : Jul 28, 2020, 4:46 PM IST

లాక్​డౌన్ సమయంలో సేవా దృక్పథంతో నిరుపేదలు, వలసకూలీలకు చేయూతనందించిన క్రియా సంఘ్ సొసైటీని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. క్రియా సంఘ్ సొసైటీ వ్యవస్థాపకులు షేక్ నయీమ్​తో పాటు అతని బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రశంసా పత్రాన్నిఅందజేశారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి చేతుల మీదుగా క్రియా సంఘ సొసైటీ వ్యవస్థాపకులు షేక్ నయీమ్​కు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

లాక్​డౌన్ సమయంలో వారు చేసిన సేవలు ఎంతో అభినందనీయమని పోలీసు ఉన్నతాధికారులు కొనియాడారు. దాదాపు 2 లక్షల మందికి పైగా ఆహారాన్ని అందించినట్లు సంస్థ వ్యవస్థాపకులు షేక్ నయీమ్ తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో తమ సంస్థ సభ్యుల ద్వారా రెండు లక్షల 45 వేల ఆహార ప్యాకెట్లు, మూడు వేలకు పైగా రేషన్ కిట్లు, శానిటరీ ప్యాడ్లు, మాస్కులు, 500 మంది వయోవృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలతో పాటు వారికి మందులను పంపిణీ చేసినట్లు వివరించారు.

ఉత్తమ సేవలకు గుర్తింపుగా రాష్ట్ర పోలీసు శాఖ అభినందించడం పట్ల నయీమ్​ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కూడా పేద వారికి సాయం చేస్తూ.... సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details