తెలంగాణ

telangana

ETV Bharat / state

డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీ విరమణ.. ఐపీఎస్​గా 36ఏళ్లు సుదీర్ఘ సేవలు - DGP Mahender Reddy Farewell meeting

రాష్ట్ర డీజీపీ మహేందర్​రెడ్డి పదవీకాలం ఈరోజుతో ముగియనుంది. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీలో మహేందర్​రెడ్డికి పదవీ విరమణ కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

DGP Mahender Reddy
DGP Mahender Reddy

By

Published : Dec 31, 2022, 10:12 AM IST

Updated : Dec 31, 2022, 1:06 PM IST

రాష్ట్ర డీజీపీ మహేందర్​రెడ్డి పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్​ అకాడమీలో ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి.. మహేందర్‌రెడ్డి అత్యధిక కాలం డీజీపీగా పనిచేశారు. ఐపీఎస్‌గా 36 ఏళ్లపాటు సుదీర్ఘ సేవలందించారు. పోలీసుశాఖలో సాంకేతికతతో కూడిన విప్లవాత్మక మార్పులను డీజీపీ మహేందర్​రెడ్డి తీసుకొచ్చారు.

నూతన డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. అంజనీకుమార్ గతంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, అవినీతి నిరోధక విభాగాధిపతిగా పనిచేశారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా.. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగానూ అంజనీకుమార్‌ సేవలు అందించారు.

Last Updated : Dec 31, 2022, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details