తెలంగాణ

telangana

ETV Bharat / state

మల్కాజిగిరి ఏసీపీపై వేటు... ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ - madhapur acp syamprasadrao as malkajgiri acp

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మల్కాజిగిరి ఏసీపీ నర్సింహరెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్​ చేస్తూ డీజీపీ మహేందర్​ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అతని స్థానంలోకి మాదాపూర్​ ఏసీపీని నియమించగా.. మాదాపూర్​లో ఇంటెలిజెన్స్​ డీఎస్పీను నియమించారు.

dgp mahendar passed orders attaching malkajgiri acp  to dgp office
మల్కాజిగిరి ఏసీపీపై వేటు... ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ

By

Published : Sep 24, 2020, 11:06 PM IST

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మల్కాజిగిరి ఏసీపీ నర్సింహ రెడ్డిపై వేటు పడింది. అతన్ని తన కార్యాలయానికి అటాచ్​ చేస్తూ డీజీపీ మహేందర్​రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అతని స్థానంలో మాదాపూర్​ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న శ్యాంప్రసాద్​రావును నియమించారు.

ఏసీపీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ మహేందర్​రెడ్డి

మాదాపూర్​ ఏసీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్​లో డీఎస్పీగా పనిచేస్తున్న రఘనందన్​రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇలా ఉంటే ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన నర్సింహారెడ్డిని సస్పెండ్​ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి :హైదరాబాద్‌లో రేపటి నుంచి సిటీ బస్సులు

ABOUT THE AUTHOR

...view details