హైదరాబాద్ పాతబస్తీలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటించారు. కరోనా కట్టడిలో భాగంగా అమలవుతోన్న లాక్‌డౌన్ తీరుతెన్నులను ఆయన పరిశీలించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నారని.. వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తున్నారు: డీజీపీ - DGP mahender reddy on lockdown
లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. పాతబస్తీలో లాక్‌డౌన్ అమలును ఆయన పరిశీలించారు.
పాతబస్తీలో లాక్‌డౌన్ అమలును పరిశీలించిన డీజీపీ
అనంతరం షాలిబండ, ఐఎస్ సదన్, సంతోశ్‌నగర్ తదితర ప్రాంతాల్లోని చెక్‌పోస్టులను డీజీపీ పరిశీలించారు. నగర సీపీ అంజనీకుమార్, దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ డీజీపీ వెంట ఉన్నారు.
ఇదీ చూడండి: రెండో డోసు కోసం టీకా కేంద్రాలకు పోటెత్తిన లబ్ధిదారులు!