ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును వైకాపా కార్యకర్తలు అడ్డుకున్న ఘటనపై ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్... అక్కడి హైకోర్టుకు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా వివరణ ఇవ్వాలన్న ధర్మాసనం ఆదేశాల మేరకు ఆయన న్యాయస్థానానికి తరలివచ్చారు.
ఏపీలో హైకోర్టుకు హాజరైన డీజీపీ గౌతమ్ సవాంగ్ - హైకోర్టుకు డీజీపీ
ఏపీ హైకోర్డుకు ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్న ఘటనపై ఈరోజు ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. సీఆర్‌పీసీ 151 అమలుపై డీజీపీ వివరణ ఇవ్వనున్నారు.

ఏపీలో హైకోర్టుకు హాజరైన డీజీపీ గౌతమ్ సవాంగ్
విశాఖ విమానాశ్రయంలో పోలీసుల తీరును తప్పుబడుతూ పిటిషన్ వేసిన శ్రావణ్‌కుమార్... వైకాపా కార్యకర్తలను నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. సీఆర్‌పీసీ 151 కింద చంద్రబాబుకు జారీ చేసిన నోటీసుపై డీజీపీ వివరణ ఇవ్వనున్నారు.
ఏపీలో హైకోర్టుకు హాజరైన డీజీపీ గౌతమ్ సవాంగ్